ప్రతిపక్షాలతో మాట్లాడే బదులు మాతో మాట్లాడండి.. గ్రూప్-1 అభ్యర్థుల ఆవేదన

హైదరాబాద్ (CLiC2NEWS): ప్రభుత్వం పేదలు, బడుగు బలహీన వర్గాల గొంతు కోస్తందని గ్రూప్-1 అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. అశోక్‌నగర్ చౌరస్తాలో గ్రూప్-1 అభ్యర్థలు ఆందోళన చేస్తున్నారు. మానసికంగా ఒత్తిడి ఎదుర్కొంటున్నామని, జిఒ 29 వలన రిజర్వేషన్ పొందేవారు ఓపెన్ కేటగిరీలో ఉద్యోగం పొందే అర్హత లేదని పేర్కొన్నారు. తాము పరీక్ష రాసేందుకు సిద్ధంగా లేమని.. సిఎం మాబాధ వినాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రతిపక్షాలతో మాట్లాడే బదులు మాతో మాట్లాడండి, రాజకీయాలకు మేము అతీతం.. మాకున్న చివరి అవకాశం చేజార్చకండి అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు గాంధీభవన్ ముట్టడికి పిలుపునిచ్చారు.
[…] […]