అమరులైన పోలీసు కుటుంబాలకు రూ.కోటి పరిహారం: సిఎం రేవంత్రెడ్డి

హైదరాబాద్ అమరులైన కానిస్టేబుల్ , ఎఎస్ఐ కుటుంబాలకు రూ. కోటి పరిహారం ఇస్తామని సిఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. నగరంలోని గోషామహల్ స్టేడియంలో నిర్వహించిన పోలీసు అమరవీరుల సంస్మరణ కార్యక్రమంలో సిఎం పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. దేశ భద్రత , ప్రజల సంరక్షణలో పోలీసుల పాత్ర ఎనలేనిదని.. విధి నిర్వహణలో మరిణించిన అధికారులను గుర్తు చేసుకోవడం అందరికీ స్ఫూర్తిదాయకమన్నారు. అమరులైన వారి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పారు. అమరులైన ఎస్ ఐ, సిఐ కుటుంబాలకు రూ. కోటి 25 లక్షలు, డిఎస్పి, ఎఎస్పి కుటుంబాలకు రూ. కోటి 50 లక్షలు.. ఎస్పి, ఐపిఎస్ కుటుంబాలకు రూ.2కోట్లు పరిహారం ఇస్తామన్నారు. శాశ్వత అంగవైకల్యం పొందిన పోలీసులకు కూడా పరిహారం అందజేస్తామని సిఎం ప్రకటించారు.