ప్రైవేటు ఉపాధ్యాయురాలి హత్యకేసు.. యావజ్జీవ కారగారశిక్షను విధించిన న్యాయస్థానం

అనంతపురం (CLiC2NEWS): రాంగ్ ఫోన్ కాల్ ద్వారా వివాహితను పరిచయం చేసుకుని ఆమెను దారుణంగా హత్య చేసిన నిందితుడికి న్యాయస్థానం యావజ్జీవ కారాగార శిక్షను విధించింది. అనంతపురం జిల్లా కంబదూరు మండలం కదిరి దేవరపల్లికి చెందిన రుద్రేశ్ రాంగ్ ఫోన్ కాల్ ద్వారా వివాహితతో పరిచయం ఏర్పరుచుకున్నాడు. నెల రోజుల వ్యవధిలోనే ఆమెను హతమార్చాడు. 2018 లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన కేసు అనంతపురం జిల్లా న్యాయస్థానంలో విచారణ పూర్తి చేసి తాజాగా తీర్పును వెలువరించింది.