రేపే సింగరేణి కార్మికులకు దీపావళి బోనస్.. రూ. 358కోట్లు విడుదలకు ఆదేశాలు

హైదరాబాద్ (CLiC2NEWS): సింగరేణి కార్మికులకు రేపే దీపావళి బోనస్ అందనుంది. కార్మికులకు రాష్ట్ర డిప్యూటి సిఎం దీపావళి బోనస్‌ను శుక్రవారమే అందించనున్నారు. దీని కోసం సింగరేణి సంస్థ రూ.358 కోట్లను విడుదల చేయాలని సింగరేణఙ సిఎండి ఎన్.బలరామ్‌ను డిప్యూటి సిఎం ఆదేశించారు. గత ఏడాది చెల్లించిన బోనస్ కన్నా ఇది రూ.50 కోట్లు అధికంగా చెల్లించనున్నారు. రేపు సాయంత్రానికల్లా దీపావళి బోనస్‌ను కార్మికుల ఖాతాల్లో జమ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఒక్కొక్క కార్మికుడికి రూ. 93,750 లు బోనస్‌గా అందనుంది. సంస్థలో పనిచేసే 40వేల మంది కార్మికులు దీపావళి బోనస్ అందుకోనున్నారు.