స్కిల్ యూనివ‌ర్సిటి నిర్మాణానికి రూ.200 కోట్లు: మేఘా

హైద‌రాబాద్‌ (CLiC2NEWS): రాష్ట్ర ప్ర‌భుత్వం అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నెల‌కొల్పిన యంగ్ ఇండియా స్కిల్క్ యూనివ‌ర్సిటి నిర్మాణానికి మేగా ఇంజినీరింగ్ ఇన్‌ఫ్రాస్ట్ర‌క్చ‌ర్ లిమిటెడ్ ముందుకొచ్చింది. ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డితో సంస్థ ఎండి కృష్ణారెడ్డి నేతృత్వంలోని ప్ర‌తినిధుల బృందం స‌చివాల‌యంలో సమేవేశ‌మ‌య్యింది. యూనివ‌ర్సిటి నిర్మాణానికి రూ. 200 కోట్లు కేటాయించింది. యూనివ‌ర్సిటి క్యాంప‌స్‌లో అవ‌స‌ర‌మ‌యిన భ‌వ‌నాల‌న్నింటినీ నిర్మించ‌నుంది. సంస్థ త‌మ సిఎస్ ఆర్ ఫండ్స్ నుండి యూనివ‌ర్సిటి నిర్మాణానికి రూ.200కోట్లు కేటాయించింది.  ఈ మేర‌కు ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శాంతి కుమారి, ప్ర‌భుత్వ ప్ర‌త్యేక కార్య‌ద‌ర్శి జ‌యేష్ రంజ‌న్‌, యూనివ‌ర్సిటి వైస్ ఛాన్స‌ల‌ర్ విఎల్‌విఎస్ఎస్ సుబ్బారావు స‌మ‌క్షంలో ఎంఒయుపై సంత‌కాలు చేశారు.

న‌గ‌రంలోని కందుకూరు మండ‌లం మీర్‌ఖాన్‌పేట స‌మీపంలో 57 ఎక‌రాల విస్తీర్ణంలో యూనివ‌ర్సిటి నిర్మాణానికి ఈ ఏడాది ఆగ‌స్టులో సిఎం భూమి పూజ చేశారు. యూనివ‌ర్సిటి నిర్మాణానికి మేఘా కంపెనీ ముందుకు రావ‌డం ప‌ట్ల సిఎం అభినంద‌న‌లు తెలిపారు.వారం రోజులులోగా స్కిల్‌ యూనివ‌ర్సిటి భ‌వ‌న డిజైన్లకు తుది రూపు ఇవ్వాల‌ని సిఎం సూచించారు. భ‌వ‌న నిర్మాణం కోసం న‌మూనాలు , డిజైన్లు స‌మావేశంలో ప్ర‌ద‌ర్శించారు. వ‌చ్చేనెల న‌వంబ‌ర్ 8 నుండి భ‌వ‌న నిర్మాణ ప‌నులు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేసుకోవాల‌ని సూచించారు.

Leave A Reply

Your email address will not be published.