సినిమాల్లో మహిళలను తక్కువ చేసి చూపిస్తున్నారు: నటి సుహాసిని

చెన్నై (CLiC2NEWS): కమర్షియల్ చిత్రాలకు సంబంధించి 2010 నుండి ఎన్నో మార్పులు వచ్చాయని.. పాశ్చాత్య పోకడలను అవలంభించడం ఎక్కువైందని సినీ నటి సుహాసిని అన్నారు. ఓ ఇంటర్వ్యూలో ఆమె చిత్రపరిశ్రమలోని పరిస్తితులపై కీలక వ్యాఖ్యలు చేశారు. సినిమాల్లో హీరోయిన్లను చూపించే తీరు గురించి చెప్పారు.
భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో సినిమాల్లో మహిళలను తక్కువ చేసి చూపిస్తున్నారని సుహాసిని అభిప్రాయం వ్యక్తం చేశారు. పాశ్చాత్య పోకడలను అవలంభించడం ఎక్కువై, స్కిన్ షో, ఇంటిమేట్ సీన్స్‌లో నటించడానికి ఇబ్బందిపడటం లేదన్నారు. గతంలో ఇలాంటి సీన్లలో నటించడానికి హీరోయిన్లు చాలా అరుదుగా అంగీకరించేవారని , ఇప్పుడలా కాదన్నారు. ఏదైనా చేస్తున్నారు అని అన్నారు. హీరోలకు స్ట్రాంగ్ రోట్స్ రాస్తున్నారని.. హీరోయిన్స్‌కు మాత్రం ప్రాధాన్యం లేని పాత్రలు ఇస్తున్నారని అన్నారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి.