జనగామ: రెండు షాపింగ్‌మాల్స్‌లో భారీ అగ్నిప్రమాదం

జనగామ (CLiC2NEWS): జిల్లా కేంద్రంలోని షాపింగ్ మాల్స్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించి భారీ నష్టం వాటిల్లింది. పట్టణంలోని వస్త్ర దుకాణంలో ఆదివారం షార్ట్‌సర్క్యూట్ వలన మంటలు వ్యాపించాయి. మంటలు దుకాణం మెత్తం అలుముకొని దట్టంగా పొగవ్యాపించింది. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అగ్నిమాపకం సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు.
సిద్దిపేట రోడ్డు వైపు ఉన్న విజయ, శ్రీలక్ష్మి షాపింగ్ మాల్‌లలో ముందుగా విజయ వస్త్ర దుకాణంలో మంటలు వ్యాపించాయి. దుకాణంలో మొత్తం దగ్ధమైన అనంతరం శ్రీలక్ష్మి దుకాణానికి మంటలు వ్యాపించాయి. దీంతో రెండు దుకాణాలు పూర్తిగా దర్గమైనట్లు తెలుస్తోంది. అగ్నిప్రమాదం కారణంగా రెండు వస్త్రదుకాణాల్లో రూ.10కోట్లకు పైగా ఆస్తినష్టం వాటిల్లినట్లు అంచనా వేస్తున్నారు.