నేషనల్ సీడ్స్ కార్పొరేషన్‌లో 188 ట్రెయినీ పోస్టులు
NSC: నేషనల్ సీడ్స్ కార్పొరేషన్ లో డైరెక్ట్ ప్రాతిపదికన ట్రెయినీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. బిఎస్‌సి అగ్రాకల్చర్ పూర్తి చేసిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. విజిలెన్స్ , హెచ్ ఆర్ , క్వాలిటి కంట్రోల్, ఎలక్ట్రికల్ , ఎలక్ట్రానిక్స్, అగ్రికల్చర్, మార్కెటింగ్, అకౌంట్స్, స్టెనోగ్రాఫర్, ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, వెల్డర్, డీజిల్ మెకానిక్, బ్లాక్‌స్మిత్ విభాగాల్లో మొత్తం 188 పోస్టులు కలవు. వీటిలో ట్రెయినీ పోస్టులు 179 ఉంటే.. డిప్యూటి జనరల్ మేనేజర్ -1, అసిస్టెంట్ మేనేజర్ -1, మేనేజ్ మెంట్ ట్రెయినీ -5 , సీనియర్ ట్రెయినీ -2 పోస్టులు కలవు. కంప్యూటర్ ఆధారిత పరీక్ష,/ స్కిల్ టెస్ట్ , ధ్రవపత్రాల పరిశీలన , ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక జరుగుతుంది. దరఖాస్తులు ఈ నెల 30వ తేదీలోపు పంపించాల్సి ఉంటుంది. కంప్యూటర్ ఆధారిత పరీక్ష డిసెంబర్ 22వ తేదీన నిర్వహిస్తారు.
మేనేజ్‌మెంట్ ట్రెయినీ పోస్టులకు 60% మార్కులతో రెండేళ్ల పిజి/ డిప్లొమా పర్సనల్ మేనేజ్‌మెంట్/ ఇండస్ట్రియల్ రిలేషన్స్ / లేబర్ వెల్ఫేర / హెచ్ ఆర్ మేనేజ్‌మెంట్ లేదా ఎంబిఎ (హెచ్ ఆర్ ఎం) కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరిగా ఉండాలి.
క్వాలిటి కంట్రోల్ విభాగంలో .. ఆగ్రోనమి / సీడ్ టెక్నాలజి / ప్లాంట్ బ్రీడింగ్ అండ్ జెనిటిక్స్ స్పెషలైజేషన్‌తో ఎంఎస్‌సి (అగ్రికల్చర్) 60%మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి
ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ విభాగంలో .. 60% మార్కులతో బిఇ/ బిటెక్
ట్రెయినీ 179 పోస్టులకు 60% మార్కులతో బిఎస్‌సి (అగ్రికల్చర్) ఉత్తీర్ణత ఉండాలి
అకౌంట్స్ 60% మార్కులతో బికాం, ఎంఎస్ ఆఫీస్ పరిజ్ఞానం
టెక్నీషియన్స్ 60%మార్కులతో ఐటిఐ సర్టిఫికెట్, ఏడాది అప్రెంటిస్‌షిప్ ట్రెయినింగ్ చేసి ఎన్ ఎసి పరీక్ష పాసవ్వాలి.
ఇంజినీరింగ్ స్టోర్స్ 55 శాతం మార్కులతో మూడేళ్ల అగ్రికల్చర్ ఇంజినీరింగ్ / మెకానికల్ ఇంజినీరింగ్ డిప్లొమా, లేదా 60% మార్కులతో ఐటిఐ సర్టిఫికెట్ (ఫిట్టర్ , డీజిల్ మెకానిక్ అండ్ ట్రాక్టర్ మెకానిక్).
ఆసక్తి గల అభ్యర్థులు పూర్తి వివరాల కోసం http//www.indiaseeds.com/ వెబ్‌సైట్ చూడగలరు.