నాగార్జున సాగర్ నుండి శ్రీశైలం వరకు బోటు ప్రయాణం ప్రారంభం
నాగార్జున సాగర్ (CLiC2NEWS): రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ నాగార్జున సాగర్ నుండి శ్రీశైలం వరకు లాంచి ప్రయాణం ప్రారంభించింది. గత ఐదేళ్లుగా ప్రణాళికలు రూపొందించినప్పటికీ.. కరోనా కారణంగా, సరైన నీటిమట్టం లేకపోవడం వంటి ఇతర కారణాల కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. ప్రస్తుతం నీటి మట్టం సరిపడా ఉండటంతో బోటు ప్రయాణానికి అనుకూలంగా ఉంటుందని భావించిన యంత్రాంగం కార్తికమాసం మొదటి రోజున లాంచి ప్రయాణం ప్రారంభించింది. సాగర్ నుండి నందికొండ మీదుగా ఏలేశ్వరం , సలేశ్వరం, తూర్పు కనుమలు, నల్లమల అటవీ ప్రాంత అందాలను వీక్షించేలా దాదాపు 120 కిలోమీటర్లు లాంచి ప్రయాణం కొనసాగుతుంది. మరోక మార్గంలో నాగర్ కర్నూల్ జిల్లా సోమశిల నుండి శ్రీశైలం వరకు లాంచి సేవలను కూడా ఇవాళ అందుబాటులోకి తీసుకొచ్చింది. మొత్తం 7 గంటల పాటు ప్రయాణం ఉంటుంది. లాంచిలో ప్రయాణం చేయడానికి పెద్దలకు రూ.2వేలు, పిల్లలకు 1,600 గా టిక్కెట్ ధర నిర్ణయించారు.