త్వరలో రాష్ట్రంలో నూతన విద్యుత్ పాలసీ.. డిప్యూటి సిఎం భట్టి

నల్గొండ (CLiC2NEWS): రాష్ట్ర డిప్యూటి సిఎం రాష్ట్రంలో ఆ దివారం యాదాద్రి థర్మల్ పవర్‌ప్లాంట్‌ను పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ… రాష్ట్రంలో త్వరలో నూతన విద్యుత్ పాలసీని తీసుకురాబోతున్నట్లు ..విద్యుత్ నిపుణులు , ప్రజల అభిప్రాయాలు తీసుకొని నూతన పాలసీని ప్రకటిస్తామని డిసిఎం తెలిపారు. మే నాటికి 4వేల మెగావాట్ల విద్యుత్‌ను గ్రిడ్‌కు అనుసంధానిస్తామని ..రాష్ట్రంలో డిమాండ్ మేరకు విద్యుత్ ఉత్పత్తి చేపడుతున్నట్లు తెలిపారు. 2028-29 నాటికి విద్యుత్ డిమాండ్ 22,488మెగావాట్లకు చేరొచ్చాని, 2034-35 నాటికి డిమాండ్ 31,809 మెగావాట్లకు చేరే అవకాశం ఉందన్నారు. మార్పులకు అనుగుణంగా గ్రీన్ ఎనర్జీని ప్రవేశపెడతామని భట్టి విక్రమార్క వివరించారు.