ఉత్త‌రాఖండ్‌లో లోయ‌లో ప‌డిన బ‌స్సు: 36 మంది మృతి

డెహ్రాడూన్ (CLiC2NEWS): ఉత్త‌రాఖండ్‌లో ప్ర‌యాణికుల‌తో వెళుతున్న బ‌స్సు లోయ‌లో ప‌డి ఘోర ప్ర‌మాదం జ‌రిగింది. ఈ ప్ర‌మాదంలో 36 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. ప్ర‌మాద స‌మ‌యంలో బ‌స్సులో 40 మంది ఉన్న‌ట్లు తెలుస్తోంది. క్ష‌త‌గాత్రుల‌ను ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. మృతుల సంఖ్య పెరిగే అవ‌కాశ‌మున్న‌ట్లు స‌మాచారం.

పౌరీ జిల్లాలోని నైనిదండా నుండి నైనితాల్‌లోని రాంగ‌న‌ర్‌కు వెళుతున్న బ‌స్సు అదుపు త‌ప్పి అల్మోరా వ‌ద్ద లోయ‌లో ప‌డిపోయింది. ఈ ప్ర‌మాదం గురించి తెలుసుకున్న ప్ర‌ధాని మోడీ మృతుల కుటుంబాల‌కు రూ.ల‌క్ష‌లు చొప్పెన ఎక్స్‌గ్రేషియా ప్ర‌క‌టించారు. రాష్ట్ర సిఎం పుష్క‌ర్ సింగ్ ధామి మృతుల కుటుంబాల‌కు రూ.4 ల‌క్ష‌లు ఆర్ధిక సాయం ప్ర‌క‌టించారు. గాయ‌ప‌డిన వారికి రూ.ల‌క్ష చొప్పున ప్ర‌క‌టించారు. క్ష‌త‌గాత్రుల‌కు మెరుగైన వైద్యం అందించాల‌ను ఆదేశించారు. ఈ ఘ‌ట‌న‌పై మెజిస్టీరియ‌ల్ విచార‌ణ జ‌రిపించాల‌ని ఆదేశించారు. ఆ ప్రాంతంలోని స‌హాయ ప్రాంతీయ ర‌వాణా అధికారిని స‌స్పెండ్ చేస్తూ ఉత్త‌ర్వులు జారీ చేశారు.

Leave A Reply

Your email address will not be published.