రూ.40వేల కోట్లతో టాటాపవర్ ప్రాజెక్టులు: సిఎం చంద్రబాబు
అమరావతి (CLiC2NEWS): ఆంధ్రప్రదేశ్‌లో రూ.40 వేల కోట్ల పెట్టుబడితో టాటాపవర్ ప్రాజెక్టులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పరస్పర సహకారంతో ముందుకెళ్లాలని టాటాగ్రూప్, ఎపి ప్రభుత్వం నిర్ణయించింది. టాటా గ్రూప్ సంస్థల ఛైర్మన్ చంద్రశేఖరన్, సిఎం చంద్రబాబుతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్రాభివృద్ధికి సంబంధించి పలుకీలక అంశాలపై చర్చించినట్లు సమాచారం. రూ.40 వేలకోట్ల పెట్టుబడితో టాటాపవర్ సోలార్, విండ్ ప్రాజెక్టులను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. విశాఖలో టిసిఎస్ ఏర్పాటు ద్వారా 10 వేల ఉద్యోగాల కల్పనకు నూతనంగా ఐటి డెవలప్‌మెంట్ సెంటర్ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు సిఎం వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో టాటాగ్రూప్ ముఖ్యమైన వాటాదారుగా కొనసాగుతుందని సిఎం తెలిపారు. ఎపి అభివృద్ధిలో రతన్ టాటా కృషి గురించి గుర్తు చేశారు. రాష్ట్రంలో పర్యాటకం, పారిశ్రామిక వృద్ధిని పెంచడానికి రాష్ట్ర వ్యాప్తంగా మరో 20హోటళ్లను ఏర్పాటు చేసేందుకు టాటా గ్రూప్ ముందుకొచ్ఇచంది. తాజ్, వివాంటా, గేట్‌వే, సెలెక్యూషన్స్, జింజర్ హోటల్స్, కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటకు టాటా గ్రూప్ సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా ప్రతీ కుటుంబంనుండి ఓ పారిశ్రామిక వేత్త తయారేందుకు వీలు కలుగుతుందన్నారు.