వికారాబాద్ ఘ‌ట‌న‌.. 55 మందిని అరెస్టు చేసిన పోలీసులు

వికారాబాద్ (CLiC2NEWS): జిల్లాలోని ల‌గ‌చ‌ర్ల గ్రామంలో సోమ‌వారం అధికారుల‌పై దాడి జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వ‌హిస్తున్న కొడంగ‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలో జ‌రిగిన ఈ ఘ‌ట‌న రాష్ట్రవ్యాప్తంగా క‌ల‌క‌లం రేపింది. ఈ ఘ‌ట‌న‌లో పోలీసులు 55 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఫార్మా కంపెనీ ఏర్పాట‌కు భూసేక‌ర‌ణ నిమిత్తం రైతుల‌తో మాట్లాడేందుకు గ్రామ‌నికి వెళ్లిన అధికారుల‌పై గ్రామ‌స్థులు దాడికి పాల్ప‌డ్డారు. దుద్యాల‌, కొడంగ‌ల్‌, బోంరాస్‌పేట మండ‌లాల్లో ఇంట‌ర్నెట్ సేవ‌లు నిలిపివేశారు. ప్ర‌ణాళిక ప్ర‌కార‌మే దాడి జ‌రిగిన‌ట్లు పోలీసులు గుర్తించారు.

శాంతిభ‌ద్ర‌త‌ల వైఫ‌ల్యానికి వికారాబాద్ ఘ‌ట‌నే నిద‌ర్శ‌నం: కెటిఆర్‌

 

అధికారుల‌పై దాడి హేయ‌మైన చ‌ర్య: ఉద్యోగుల జెఎసి ఛైర్మ‌న్‌

Leave A Reply

Your email address will not be published.