India Today: అత్యంత శ‌క్తివంత‌మైన ప్ర‌ధాని మోడీ

ముఖ్య‌మంత్రుల‌లో అగ్ర‌స్థానంలో ఎపి సిఎం చంద్ర‌బాబు

India Today: దేశంలో రాజ‌కీయంగా ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ అత్యంత శ‌క్తిమంతుడిగా ఉన్న‌ట్లు ఇండియా టుడే పేర్కొంది. దేశంలో 2024 సంవ‌త్స‌రంలో ఉన్న రాజ‌కీయ నాయ‌కుల ప‌నితీరు, ప్ర‌స్తుత రాజకీయ ప‌రిస్థితుల ఆధారంగా వారి శ‌క్తి సామ‌ర్థ్యాల‌ను ఇండియా టుడే అంచ‌నా వేసింది.  వ‌రుస‌గా మూడోసారి విజ‌యం సాధించి.. 60 యేళ్ళ రికార్డును తిర‌గ రాశార‌ని.. ప్ర‌పంచ దేశాల‌లో స్నేహ సంబంధాలు కొన‌సాగిస్తూ భార‌త ఆర్ధిక వ్య‌వ‌స్థ‌ను 4 ట్రిలియ‌న్ డాల‌ర్ల‌స్థాయికి తీసుకెళ్లారు అని ఇండియా టుడే విశ్లేషించింది.

మోడీ త‌ర్వాత స్థానాల్లో ఆర్‌ఎస్ఎస్‌స‌ర్ సంఘ్‌చాల‌క్ మోహ‌న్ భాగ‌వ‌త్, హోంమంత్రి అమిత్‌షా, రాహుల్ గాంధీ ఉన్న‌ట్లు వెల్ల‌డించింది. ప్ర‌ధాన‌మంత్రికి క‌ళ్లు, చెవుల్లా ప‌రిచేస్తున్నార‌ని, కేంద్రం తీసుకొనే ప్రతీ నిర్ణ‌యం ఈయ‌న ఆమోదంతో కార్య‌రూపం దాల్చుతుంద‌ని పేర్కొంది. ఇక నాలుగో స్థానంలో రాహుల్ గాంధీ నిలిచారు. లోక్‌స‌భ‌లో విప‌క్ష నేత‌గా ఉన్న రాహుల్ గాంధీ ఈ జాబితాలో నాలుగో స్థానంలో నిలిచాడు. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం కోల్పోయిన కాంగ్రెస్ పార్టీకి ఆ హోదాని తీసుకువ‌చ్చిన నాయ‌కుడిగా రాహుల్ గుర్తింపు పొందారు.

దేశంలో శ‌క్తిమంత‌మైన ముఖ్య‌మంత్రిగా ఎపి సిఎం చంద్ర‌బాబు నాయుడు నిలిచారు.   2019 ఎన్నిక‌ల్లో ఓట‌మిపాలైనా,  జైలు కెళ్లినా.. తిరిగి శ‌క్తినంతా కూడ‌గ‌ట్టుకొని 2024 ఎన్నిక‌ల్లో స‌త్తా చాటారు. కేంద్ర , రాష్ట్ర ప్ర‌భుత్వాలపై త‌న‌దైన ముద్ర వేశారు. ఏకంగా 16 మంది ఎంపిలు, కూట‌మిపార్టీల‌తో క‌లిపి 21 మంది ఎంపిలు గెలిపించి.. ఎన్‌డిఎలో టిడిపి రెండో పెద్ద పార్టీగా నిలిచారు.   ఈ జాబితాలో తర్వాత స్థానాల్లో బిహార్ సిఎం నితీష్ కుమార్‌, ఉత్త‌ర ప్ర‌దేశ్ సిఎం యోగి ఆదిత్య‌నాథ్‌, త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి స్థాలిన్‌, బెంగాల్ సిఎం మ‌మ‌త బెన‌ర్జి తదిత‌రులు అత్యంత శక్తి మంత‌మైన నేత‌లుగా నిలిచారు.

Leave A Reply

Your email address will not be published.