కోచింగ్ సెంటర్లకు మార్గదర్శకాలు జారీ చేసిన కేంద్రం
ఢిల్లీ (CLiC2NEWS): విద్యార్థులకు శిక్షణనిచ్చే కోచింగ్ సెంటర్లకు కేంద్రం మార్గదర్శకాలు జారీ చేసింది. 100% జాబ్ గ్యారెంటి, 100% సెలెక్షన్ వంటి తప్పుడు ప్రకటనలను నియంత్రించేందుకు ఈ నూతన మార్గదర్శకాలు జారీ చేసినట్లు సమాచారం. వివిధ పోటీ పరీక్షల కోసం విద్యార్థులకు శిక్షణనిచ్చే కోచింగ్ సెంటర్లు తప్పుడు ప్రకటనలు చేయకూడదని కేంద్రం హెచ్చరించింది. కేంద్ర వినియోగదారుల భద్రత సంస్థ (సిసిపిఎ) కు అనేక ఫిర్యాదులు అందాయి. దీంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కోచింగ్ సెంటర్లు ప్రభుత్వం వ్యతిరేకం కాదని.. ప్రకటనలనేవి వినియోగదారుల హక్కులను దెబ్బతీయకూడదన్నారు. కేంద్రం రూపొందించిన మార్గదర్శకాలను ఉల్లంఘించిన వారికి వినియోగదారుల రక్షణ చట్టం కింద పెద్ద మొత్తంలో జరిమానా విధిస్తామని అధికారులు పేర్కొన్నారు.
కోచింగ్ సెంటర్లు అందించే కోర్సులు, వాటి వ్వవధికి సంబంధించి తప్పుడు ప్రకటనలు చేయకూడదు.
అభ్యర్థులు ఉద్యోగాలకు ఎంపికైన అనంతరం వారి రాతపూర్వక అనుమతి లేకుండా వారి పేర్లు, ఫోటోలు ఉపయోగించకూడదు.
కోర్సుల గురించి ముఖ్యమైన సమాచారాన్ని బహిర్గతం చేయాలి.
కొంత మంది యుపిఎస్‌సి అభ్యర్థులు సొంతంగా ప్రిలిమ్స్ , మెయిన్స్ క్లియర్‌చేసి.. ఇంటర్వ్యూలకు మాత్రమే కోచింగ్ తీసుకుంటారు. అటువంటి విషయాలను కోచింగ్ సెంటర్లు బహిరంగంగా తెలియజేయాలి.
ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు తమ వద్ద ఏ కోర్సులో శిక్షణ తీసుకున్నారో తెలియజేయాలి.
చట్టపరంగా అనుమతి తీసుకున్న భవనాల్లో మాత్రమే కోచింగ్ సెటర్లు నడపాలి. అభ్యర్థలకు కావాల్సిన మౌలిక సదుపాయాలు, భద్రత కల్పించాలి.