సఫారీల సొంత గడ్డపై భారత బ్యాటర్ల దూకుడు.. 3-1 తో సిరీస్ కైవసం
జొహెనెస్‌బర్గ్ (CLiC2NEWS): దక్షిణాఫ్రికాతో జరిగిన నాలుగు టి20 సిరీస్‌లో భారత్ 3-1 తేడాతో సిరీస్‌న్ కైవసం చేసుకుంది. శుక్రవారం జరిగిన నాలుగో టి20 మ్యాచ్‌లో భారత్ బ్యాటర్లు ఒక వికెట్ నష్టానికి 283 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో తిలక్ 120, శాంసన్ 109 సెండరీలతో విధ్యంసం సృష్టించారు. తిలక్ వర్మ 120 (47 బంతుల్లో 9×4 , 10×6)పరుగులు చేయగా.. శాంసన్ 109 (6×4, 4×6) పరుగులు చేశారు. దీంతో ఈ సిరీస్ చివరి మ్యాచ్‌లో టీమ్ ఇండియా 135 పరుగుల భారీ తేడాతో విజయం సొంతం చేసుకుంది. మ్యాచ్ చూస్తున్నంతే సేపూ హైలైట్లు చేస్తున్నామా.. అనే అంతగా ఫోర్లు, సిక్సర్లతో చెలరేగిపోయారు.
284 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సఫారీల జట్టు 18.2 ఓవర్లలో 148 పరుగులకు ఆలౌటయింది. దీంతో విదేశాల్లో టి20లో భారత్‌కు అత్యుత్తమ స్కోరు. అంతర్జాతీయ టి20 ఇన్నింగ్స్‌లో (ఐసిసి సభ్య దేశారు) ఇద్దరు బ్యాటర్లు సెంచరీలు చేయడం ఇదే మొదటిసారి. దక్షిణాఫ్రికా వరుసగా రెండు మ్యాచుల్లో సెంచరీలు సాధించిన తిలక్ వర్మకు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అందుకున్నాడు. నాలుగో టి 20లో ఆటతీరుకు అంతేకాక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ కూడా దక్కింది.