GAIL: గ్యాస్ అథారిటి ఆఫ్ ఇండియా లిమిటెడ్‌లో 261 పోస్టులు

GAIL: గ్యాస్ అళారిటి ఆఫ్ ఇండియ లిమిటెడ్‌ (GAIL)లో సీనియ‌ర్ ఇంజినీర్‌, సీనియ‌ర్ ఆఫీస‌ర్ , ఇత‌ర పోస్టుల నియామ‌కానికి ప్ర‌క‌ట‌న విడుద‌లైంది. మొత్తం 261 పోస్టుల ఉండ‌గా.. అన్ రిజ‌ర్వుడ్‌కు 126, ఇడబ్ల్యు ఎస్‌ల‌కు 22, ఒబిసిల‌కు 54, ఎస్‌సిల‌కు 43, ఎస్‌టిల‌కు 16 పోస్టులు కేటాయించారు.

సీనియ‌ర్ ఇంజినీర్ పోస్టులు 98

రెన్యూవ‌బుల్ ఎన‌ర్జి / బాయిల‌ర్ ఆప‌రేష‌న్స్ / మెకానిక‌ల్ / ఎలక్ట్రిక‌ల్ / ఇన్‌స్ట్రుమెంటేష‌న్ / కెమిక‌ల్ / సివిల్ బ్రాండుల్లో 65% మార్కుల‌తో ఇంజినీరింగ్ డిగ్రీ ఉండాలిఇ. సంబంధిత విభాగంలో ఏడాది అనుభవం ఉండాలి.

సీనియ‌ర్ ఆఫీస‌ర్స్ 130

65% మార్కుల‌తో ఇంజినీరింగ్ / ఎంబిఎ( మార్కెటింగ్/ ఆయిల్ అండ్ గ్యాస్‌/ పెట్రోలియం అండ్ ఎన‌ర్జి/ ఎన‌ర్జి అండ్ ఇన్‌ఫ్రాస్ట్ర‌క్చ‌ర్‌)లేదా సిఎ/ సిఎంఎ లేదా 60% మార్కుల‌తో బికాం, ఎల్ ఎల్‌బి లేదా ఐదేళ్ల ఇంటిట్రేటెడ్ ఎల్ ఎల్ బి లేదా ఎంబిబిఎస్ లేదా ఎంఎస్‌సి/ హిందీ మాస్ట‌ర్ డిగ్రీ/ హిందీ లిట‌రేచ‌ర్.

ఆఫీస‌ర్ 33
ల్యాబొరెట‌రి, సెక్యూరిటి, అఫీషియ‌ల్ లాంగ్వేజ్ విభాగాల్లో 60% మార్కుల‌తో ఎంఎస్‌సిఎ / ఏదైనా డిగ్రీ, ఇండ‌స్ట్రియ‌ల్ సెక్కూరిటి డొప్లొమా/ హిందీ/ హ‌ఇందీ లిచ‌రేచ‌ర్‌లోమాస్ట‌ర్ డిగ్రీ, అనువాదంలో డిప్లొమా.

వ‌య‌స్సు సీనియ‌ర్ ఇంజినీర్ పోస్టుల‌కు 28 ఏళ్లు, సీనియ‌ర్ ఆఫీస‌ర్ పోస్టుకు32 ఏళ్లు మించ‌కూడ‌దు. ఆఫీస‌ర్ పోస్టుకు విభాగాల‌ను బ‌ట్టి 32, 35, 45 ఏళ్ల వ‌య‌స్సు ఉండాలి.

ఎంపికైన వారికి దేశ‌వ్యాప్తంగా ఉన్న గెయిల్ ఆఫీసుల‌లో ఎక్క‌డైనా నియ‌మించ‌వ‌చ్చు. ధ్రువ‌ప‌త్రాల ప‌రిశీల‌న ద్వారా ఎంపిక జ‌రుగుతుంది. ద‌ర‌ఖాస్తుల‌ను డిసెంబ‌ర్ 11లోపు పంపించాల్సి ఉంది. పూర్తి వివ‌రాల‌కు https://gailonline.com వెబ్‌సైట్ చూడ‌గ‌ల‌రు.

 

 

Leave A Reply

Your email address will not be published.