థాయ్‌లాండ్ ఎయిర్‌పోర్టులో చిక్కుకున్న 100 మందికి పైగా ప్ర‌యాణికులు

థాయ్ లాండ్ నుండి ఢిల్లీకి రావాల్సిన ఎయిరిండియా కు చెందిన విమానంలో సాంకేతిక లోపం కార‌ణంగా నిలిచిపోయింది. దీంతో 100 మందికి పైగా ప్ర‌యాణికులు 80 గంట‌లుగా ఎయిర్‌పోర్టులోనే ఉండిపోవాల్సి వ‌చ్చింది. న‌వంబ‌ర్ 16న థాయ్‌లాండ్ నుండి ఢిల్లీకి బ‌య‌లుదేరిన విమానం.. టేకాఫ్ అయిన కాసేప‌టికే దానిలో సాంకేతిక లోపం తలెత్తింది. ముందుగా ప్ర‌యాణికులు ఆరు గంట‌ల‌పాటు ఎయిర్‌పోర్టులో వేచి ఉన్నారు. అనంత‌రం సిద్దంగా ఉన్న విమానంలో ఎక్కించారు. టేకాఫ్ అయిన రెండు గంట‌ల త‌ర్వాత పుకెట్‌లో మ‌ళ్లీ విమానాన్ని ల్యాండ్ చేశారు. అలా 80 గంట‌లుగా ఎయిర్‌పోర్టులోనే చిక్కుకుపోయిన‌ట్లు సోష‌ల్ మీడియాలో ప్ర‌యాణికులు పోస్టులు పెట్టారు. ఈ ఘ‌ట‌న‌పై ఎయిర్‌లైన్స్ సంబంధిత వ‌ర్గాలు స్పందిస్తూ.. కొందిరిని ఇప్ప‌టికే గ‌మ్మ‌స్థానానికి పంపించేందుకు ఏర్పాట్లు చేసిన‌ట్లు తెలిపారు. ప్ర‌యాణికుల‌ను సుర‌క్షితంగా పంపించేందుకు ప్ర‌య‌త్నిస్తున్న‌ట్లు వెల్ల‌డించాయి.

Leave A Reply

Your email address will not be published.