90 నిమిషాల పాటు ఆగి.. తిరిగి మళ్లీ కొట్టుకున్న గుండె
భువనేశ్వర్ (CLiC2NEWS): అనారోగ్య కారణాలతో భువనేశ్వర్‌లోని ఎయిమ్స్ లో చేరిన ఆర్మీ జవాన్‌కు వైద్యులు పునర్జన్మ ప్రసాదించారు. గత నెల 1వ తేదీన ఆస్పత్రిలో చేరిన అతను కొద్దిసేపటికే గుండె కొట్టుకోవడం ఆగిపోయింది. వెంటనే వైద్యులు 40 నిమిషాల పాటు సంప్రదాయ సిపిఆర్‌న నిర్వహించారు. అయినా గుండెలో ఎలాంటి చలనం లేదు. అనంతరం ప్రత్యేకమైన ఎక్స్‌ట్రాకార్పొరియల్ కార్డియో-పల్మనరీ రిససిటేషన్ (ఇసిపిఆర్) ప్రయోగించాలని నిర్ణయించారు.
డాక్టర్ శ్రీకాంత్ బెహరా నేతృత్వంలోని బృందం ఎక్స్‌ట్రాకార్పొరియల్ మేంబ్రేన్ ఆక్సిజనేషన్ (ఎక్మో)తో చికిత్స అందిచారు. గుండె, ఊపిరితిత్తుల పనితీరు సరిగా లేని వారికి తొడ్పాటు అందించడానికి ఎక్మోని వినియోగిస్తారు. దీంతో 90 నిమిషాల తర్వాత జవాన్ గుండె కొట్టుకోవడం మొదలైంది. అయితే గుండె పని తీరు సక్రమంగా లేదు. 30 గంటల తర్వాత గుండె పనీతీరు గణనీయంగా మెరుగుపడింది. 96 గంటల తర్వాత ఎక్మోని తొలగించారు. ప్రస్తుతం అతను పూర్తి స్పృహలో ఉన్నట్లు సమాచారం.