భారీగా నకిలీ రేషన్ కార్డుల ఏరివేత: కేంద్రం

ఢిల్లీ (CLiC2NEWS): దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 20.4కోట్ల రేషన్ కార్డుల డిజిటలీకరణ పూర్తయిందని కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖ పేర్కొంది. దేశంలో మొత్తంగా 80 కోట్ల మంది లబ్ధిదారులు రేషన్ కార్డు ద్వార ప్రయోజనం పొందుతున్నారు. ఆధార్ ధ్రువీకరణ, ఇకెవైసి వెరిఫికేషన్‌ల ద్వారా 5.8 కోట్ల నకిలీ రేషన్ కార్డులు తొలగిపోయినట్లు సమాచారం. డిజిటలీకరణ ద్వారా ప్రజా పంపిణీ వ్యవస్థ లో భారీ స్థాయిలో మార్పులు వచ్చాయని, తద్వారా ఆహా భద్రతలో ప్రపంచానికే బెంచ్ మార్కును నెలకొల్పినట్లైందని కేంద్ర వెల్లడించింది. ఆహార పదార్థాల సరఫరా విషయంలో పుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (FCI) పకడ్భందీగా వ్యవహరిస్తోందని వెల్లడించింది. వన్ నేషన్-వన్ రేషన్ కార్డు పథకంలో లబ్ధిదారులు దేశంలో ఎక్కడైనా సరుకులు తీసుకునే అవకాశం కలిగిందని తెలిపింది.