మహిళ‌ల ఆసియా ఛాంపియ‌న్స్ ట్రోఫీ హాకీ విజేత భార‌త్‌

రాజ్‌గిర్‌ (CLiC2NEWS): మ‌హిళ‌ల‌ ఆసియా ఛాంపియ‌న్స్ ట్రోఫీ 2024 ని భార‌త్ జ‌ట్టు కైవ‌సం చేసుకుంది. బిహార్ లోని రాజ్‌గిర్ వేదిక‌గా బుధ‌వారం జ‌రిగిన ఫైన‌ల్ మ్యాచ్‌లో 1-0 తేడాతో చైనాను ఓడించి ట్రోఫీని సొంతం చేసుకుంది. భార‌త్ ఈ టైటిల్‌ను సొంతం చేసుకోవ‌డం ఇది మూడోసారి. తొలి అర్ధ‌భాగంలో ఇరుజ‌ట్లు ఒక్క గోల్ చేయ‌లేక‌పోయాయి. భార‌త్‌కు నాలుగు పెనాల్టి కార్న‌ర్‌లు ల‌భించినా వాటిని గోల్స్‌గా మ‌ల‌చ‌లేక‌పోయింది. మూడో క్వార్ట‌ర్ ఆరంభంలో ల‌భించిన పెనాల్టి కార్న‌ర్‌ను గోల్‌గా మ‌లిచింది. అనంత‌రం రెండో అర్ద‌భాగంలో చైనా స్కోర్‌ను స‌మం చేయ‌డానికి ప్ర‌య‌త్నించింది. ఆప్ర‌య‌త్నాన్ని భార‌త్ జ‌ట్టు అడ్డుకుంది.

Leave A Reply

Your email address will not be published.