బోర్డ‌ర్ గ‌వాస్క‌ర్ ట్రోఫీ: టెస్టుల్లోకి అరంగేట్రం చేసిన తెలుగు కుర్రాడు

Nithish Kumar: బోర్డ‌ర్ గ‌వాస్క‌ర్ ట్రోఫీ లో భాగంగా తొలి మ్యాచ్ ఆసీస్‌-భార‌త్‌ల మ‌ధ్య జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ఇద్ద‌రు యువ క్రికెట‌ర్లు అరంగేట్రం చేశారు. తెలుగు కుర్రాడు, పేస్ ఆల్‌రౌండ‌ర్‌ నితీశ్ కుమార్ రెడ్డి తొలి టెస్టు తుది జ‌ట్టులో చోటు సంపాదించాడు. 21 ఏళ్ల నితీశ్ తొలి ఇన్నింగ్స్‌లో 41 ప‌రుగులు చేశాడు. 59 బంతుల్లో 6 ఫోర్లు, ఒక సిక్స్ చేశాడు. ఇటీవ‌ల బంగ్లాదేశ్ టి20 సిరీస్‌లో అరంగేట్రం చేసిన నితీశ్.. బ్యాట‌ర్‌గా మంచి మార్క‌లు సంపాదించాడు. ఢిల్లీ వేదిక‌గా జ‌రిగిన రెండో టి 20లో 34 బంతుల్లోనే 74 ప‌రుగులు చేశాడు. ఈ ప్ర‌ద‌ర్శ‌న‌తో అస్ట్రేలియాతో జ‌రిగే టెస్టు మ్యాచ్‌లో చోటు సంపాదించాడు.

మ్యాచ్ ఆరంభానికి ముందు భార‌త స్టార్ క్రికెట‌ర్ విరాట్ కోహ్లీ నుండి క్యాప్ అందుకున్న నితీశ్‌.. ఇది చాలా గొప్ప అనుభూతి అని, విరాట్‌భాయ్ నుండి క్యాప్ అందుకోవ‌డం ఎంతో అద్భుత‌మైన క్ష‌ణం అన్నారు. కోహ్లీ త‌న ఆరాధ్య దైవ‌మ‌ని, అత‌ని నుండి క్యాప్ అందుకోవ‌డం సంతోషంగా ఉంద‌న్నారు. ఈ మ్యాచ్‌లో యువ పేస‌ర్ హ‌ర్షిత్ రాణా కూడా అరంగేట్రం చేశాడు.

భార‌త్‌-ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో భార‌త్ 150 ప‌రుగులు చేసి ఆలౌట్ కాగా.. తొలి రోజు ఆట ముగిసే స‌మ‌యానికి ఆసీస్ 7 వికెట్ల న‌ష్టానికి 67 ప‌రుగులు చేసింది.

Leave A Reply

Your email address will not be published.