అనంత‌పురం జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం. ఏడుగురి మృతి

గార్ల‌దిన్నె (CLiC2NEWS): వ్య‌వ‌సాయ కూలీలు ప్ర‌యాణిస్తున్న ఆటోను ఆర్‌టిసి బ‌స్సు ఢీకొట్టింది. ఈ ప్ర‌మాదంలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘ‌ట‌న అనంత‌పురం జిల్లా గార్ల‌దిన్నె మండ‌లం త‌ల‌గాసుప‌ల్లో వ‌ద్ద చోటుచేసుకుంది. ప్ర‌మాద స్థ‌లంలో ఇద్ద‌రు మృతి చెంద‌గా.. ఆస్ప‌త్రికి తీసుకెళ్తుండ‌గా ఇద్ద‌రు, చికిత్స పొందుతూ మ‌రో ముగ్గురు మృతి చెందిన‌ట్లు సమాచారం. మ‌రో న‌లుగురి ప‌రిస్థితి విష‌మంగా ఉన్నట్లు తెలుస్తోంది. వీరికి అనంత‌పురం ప్ర‌భుత్వాసుప‌త్రిలో చికిత్స అందిస్తున్నారు. ప్ర‌మాద స‌మ‌యంలో ఆటోలో 12 మంది ఉన్నారు. ఆర్‌టిసి డ్రైవ‌ర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొన్న‌ట్లు తెలిపారు.

రోడ్డు ప్ర‌మాదం గురించి తెలుసుకున్న సిఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. మ‌ర‌ణించిన వారి కుటుంబాల‌కు రూ. 5 ల‌క్ష‌ల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్ర‌క‌టించారు. చికిత్స పొందుతున్న వారికి మెరుగైన వైద్యం అందేలా చూడాల‌ని ఆదేశించారు.

Leave A Reply

Your email address will not be published.