16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్‌మీడియా నిషేధం..
Social Media: 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా వాడకుండా చట్టం తీసుకురావాలని ప్రతి దేశంలోనూ చర్చ జరుగుతూనే ఉంటుంది. కానీ తొలిసారిగా 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా వాడకుండా చట్టం తీసుకొచ్చిన తొలి దేశంగా అస్ట్రేలియా నిలవనుంది. సామాజిక మాధ్యమాలు వాడకుండా నిషేధించే బిల్లును ఆస్ట్రేలియా సెనెట్ ఆమోదించింది. సెనెట్‌లో ఈబిల్ల్లుకు అనుకూలంగా 34, వ్యతిరేకంగా 19 ఓట్లు పోలయ్యాయి. ప్రతినిధుల సభలో 102 ఓట్ల బలంతో బిల్లుకు ఆమోదం లభించింది. అతి త్వరలో ఈ బిల్లు చట్టం కానున్నట్లు సమాచారం. టిక్‌టాక్, ఫేస్‌బుక్, స్నాప్‌చాట్, ఎక్స్,రెడిట్, టెలిగ్రామ్ సహా ఏ సోషల్ మీడియా ను పిల్లలు వినియోగించలేరు. ఒక వేళ16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియా ఖాతాలు ఉన్నట్లు గుర్తిస్తే సంస్థలకు జరిమానా కూడా విధించే అవకాశమున్నట్లు తెలుస్తుంది. అది మన భారత కరెన్సీలో రూ.280 కోట్లు ఉండనుంది.