తిరుప‌తి స్థానికుల‌కు శ్రీ‌వారి ద‌ర్శ‌నం.. మార్గద‌ర్శ‌కాలు జారీ..

తిరుప‌తి (CLiC2NEWS): ప్ర‌తి నెలా మొద‌టి మంగ‌ళ‌వారం స్థానికుల‌కు శ్రీ‌వారి ద‌ర్శ‌నం క‌ల్పించాల‌ని టిటిడి నిర్ణ‌యించింది. టిటిడి ధ‌ర్మ‌క‌ర్త‌ల నిర్ణ‌యం మేర‌కు .. తిరుప‌తి స్థానికుల‌కు డిసెంబ‌ర్ 3 నుండి స్వామివారిని ద‌ర్శించుకునే భాగ్యం క‌ల్పించ‌నున్నారు. దీనికి సంబంధించి ఈ నెల 2 వ తేదీన తిరుప‌తిలోని మ‌హ‌తి ఆడిటోరియంలో 2,500 టోకెన్లు, తిరుమ‌ల బాలాజి న‌గ‌ర్‌లోని క‌మ్యూనిటి హాల్లో 500 ద‌ర్శ‌న టోకెన్లు ఉచితంగా జారీ చేస్తారు. ఈ టోకెన్ల‌కు ఉద‌యం 3 నుండి 5 గంట‌ల మ‌ధ్య జారీ చేయ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు. ముందుకు వ‌చ్చిన వారికి తొలి ప్రాధాన్య‌త క్ర‌మంలో టోకెన్లు కేటాయిస్తారు.

టోకెన్లు తీసుకోవడాని వ‌చ్చే స్థానికులు త‌మ ఒరిజిన‌ల్ ఆధార్‌కార్డు త‌ప్ప‌నిస‌రిగా చూపించాలి. శ్రీ‌వారి ద‌ర్శ‌నానికి ఒరిజిన‌ల్ ఆధార్ కార్డు తీసుకురావాల్సి ఉంటుంది. వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని ఫుట్‌పాత్ హాల్ (దివ్య‌ద‌ర్శ‌నం) క్యూలైన్లో భ‌క్తుల‌ను ద‌ర్శ‌నాల‌కు అనుమ‌తిస్తారు. వీరికి ఇత‌ర ద‌ర్శ‌నాల్లో ఇచ్చే విధంగా ద‌ర్శ‌నానంత‌రం ఒక ల‌డ్డూ ఉచితంగా అందిస్తారు. ఒక సారి ద‌ర్శనం చేసుకున్న అనంత‌రం తిరిగి 90 రోజుల వ‌ర‌కు ద‌ర్శ‌నం చేసుకునేందుకు అవ‌కాశం ఉండ‌దు.

 

Leave A Reply

Your email address will not be published.