హైదరాబాద్-బీజాపుర్ రహదారిపై లారీ బీభత్సం.. నలుగురు మృతి
కూరగాయల వ్యాపారులపైకి దూసుకెళ్లిన లారీ

హైదరాబాద్ (CLiC2NEWS): హైదరాబాద్-బీజాపుర్ రహదారిపై కూరగాయల వ్యాపారులపైకి లారీ దూసుకొచ్చింది. ఈ ప్రమాదంలో నలుగురు దుర్మరణం చెందారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఆలూరు స్టేజి వద్ద ఓ లాకీ అదుపు తప్పి వ్యాపారులపైకి దూసుకెళ్లింది. అనంతరం చెట్టును ఢీకొట్టి ఆగింది. దూసుకొస్తున్న లారీని చూసి అక్కడివారు భయంతో పరుగులు తీశారు. లారీ కింద పడి నులుగురు మృతి చెందారు. లారీ డ్రైవర్ క్యాబిన్లో ఇరుక్కొని తీవ్రగాయాలపాలయ్యాడు. అతనిని ఆస్పత్రికి తరలించారు. మరికొందరికి తీవ్రగాయాలైనట్లు సమాచారం. క్షతగాత్రులను చెవెళ్ల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి కిలోమీటరు దూరంలో ఆదివారం కూడా రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో దంపతులు మృతి చెందారు.