గోవా షిప్‌యార్డ్‌లో ప్రాజెక్ట్ ప్రొడ‌క్ష‌న్ కో-ఆర్డినేట‌ర్ పోస్టులు

Project Production Coordinators :హెచ్‌యుఎల్ఎల్‌, మెకానిక‌ల్ , వెప‌న్స్‌, ప‌వ‌ర్, జిటి మెషిన‌రీ కంట్ర‌ల్స్ విభాగాల్లో 12 ప్రాజెక్ట్ ప్రొడ‌క్ష‌న్ కొ-అర్డినేట‌ర్ పోస్టులు భ‌ర్తీ చేయ‌నున్నారు. ర‌క్ష‌ణ మంత్రిత్వ శాఖ ప‌రిధిలోని గోవా షిప్‌యార్డ్ లిమిటెడ్ ఒప్పంద ప్రాతిప‌దిక‌న ఈ ఉద్యోగాల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఇంజినీరింగ్ డిప్లొమా లేదా తత్స‌మాన విద్యార్హ‌త , ఉద్యోగానుభ‌వం క‌ల‌వారు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. ద‌ర‌ఖాస్తుల‌ను డిసెంబ‌ర్ 10లోపు పంపించాల్సి ఉంది. ద‌ర‌ఖాస్తుల‌ను ది హెడ్ ఆఫ్ ది డిపార్ట్‌మెంట్ (హెచ్ ఆర్‌ఖిఎ), డా.బిఆర్ అంబేద్క‌ర్ భ‌వ‌న్‌, గోవా షిప్‌యార్డ్ లిమిటెడ్, వాస్కోడాగామా , గోవా.. చిరునామాకు పంపించాల్సి ఉంది. అభ్య‌ర్థ‌లు వ‌య‌స్సు 31, డిసెంబ‌ర్ 2024 నాటికి 65 ఏళ్లు మించ‌కూడ‌దు. విద్యార్హ‌త‌లు,ఇంట‌ర్వ్యూల ఆధారంగా అభ్య‌ర్థుల ఎంపిక జ‌రుగుతుంది.

Leave A Reply

Your email address will not be published.