వ‌రంగ‌ల్ నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జిలో 56 పోస్టులు

నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జి (ఎన్ ఐటి).. డైరెక్ట్ /   డిప్యూటేష‌న్ ప్రాతిప‌దిక‌న 56 నాన్‌టీచింగ్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తున్నారు. 60% మార్కుల‌తో బిఇ/  బిటెక్‌, ఎమ్మెస్‌సి, ఎంసిఎ అర్హ‌త క‌లిగిన అభ్య‌ర్థులు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. అభ్య‌ర్థుల వ‌య‌స్సు 56 ఏళ్లు మించ‌కూడ‌దు. ఇంట‌ర్వ్యూ, ధ్రువ‌ప‌త్రాల ప‌రిశీల‌న ఆధారంగా ఎంపిక జ‌రుగుతుంది. ద‌ర‌ఖాస్తుల‌ను జ‌న‌వ‌రి 7వ తేదీలోపు పంపించాల్సి ఉంది. గ్రూప్‌-ఎ, గ్రూప్‌-బి, గ్రూప్‌-సి ల‌లో మొత్తం 56 ఉద్యోగాలు క‌ల‌వు.

ప్రిన్సిప‌ల్ సైంటిఫిక్‌/  టెక్నిక‌ల్

ఆఫీస‌ర్ :   ప్రిన్సిప‌ల్ స్టూడెంట్స్ యాక్టివిటి అండ్ స్పోర్ట్స్ ఆఫీస‌ర్ (ఎస్ ఎ ఎస్‌) -1, డిప్యూటి రిజిస్ట్రార్ -1, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ -1, అసిస్టెంట్ రిజిస్ట్రార్‌-1

గ్రూప్‌-బి:  అసిస్టెంట్ ఇంజినీర్ -3, సూప‌రింటెండెంట్ 05, జూనియ‌ర్ ఇంజినీర్‌-3, లైబ్ర‌రీ అండ్ ఇన్ఫ‌ర్మేష‌న్ అసిస్టెంట్ -1, స్టూడెంట్స్ యాక్టివిటి అండ్ స్పోర్ట్స్ అసిస్టెంట్ -1

గ్రూప్‌-సి:  సీనియ‌ర్ అసిస్టెంట్ -8, జూనియ‌ర్ అసిస్టెంట్ -5, ఆఫీస్ అటెండెంట్‌-10, ల్యాబ్ అసిస్టెంట్-13

గ్రూప్ -ఎ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు ఫీజు రూ.1000 , గ్రూప్‌-బి , గ్రూప్-సి పోస్టుల‌కు రూ.500 ఎస్‌సి /  ఎస్ /   దివ్యాంగ‌/  మ‌హిళ‌ల‌కు ఫీజు మిన‌హాయించారు. పూర్తి వివ‌రాల‌కు https://carees.nitw.ac.in/  వెబ్‌సైట్ చూడ‌గ‌ల‌రు.

 

Leave A Reply

Your email address will not be published.