యాదాద్రి: కారు చెరువులోకి దూసుకెళ్లి ఐదుగురు మృతి

పోచంప‌ల్లి (CLiC2NEWS): కారు అదుపు త‌ప్పి చెరువులోకి దూసుకెళ్లి ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘ‌ట‌న యాదాద్రి భువ‌న‌గిరి జిల్లా భూదాన్ పోచంప‌ల్లి మండ‌లం జ‌లాల్‌పూర్ స‌మీపంలో చోటుచేసుకుంది. కారు చెరువులోకీ దూసుకెళ్లింది. ఈ ప్ర‌మాదంలో ఐదుగురు యువ‌కులు మృతి చెందారు. మ‌ర‌ణించిన వారంతా 20 నుండి 21ఏళ్ల వ‌య‌స్సు లోపు వారేన‌ని స‌మాచారం. మ‌ద్య మ‌త్తులో కారు ప్ర‌మాదానికి గురైన‌ట్లు తెలుస్తోంది. ప్ర‌మాద స‌మ‌యంలో కారులో ఆరుగురు యువ‌కులు ఉన్నారు. వీరిలో ఒక‌రు మాత్రం సుర‌క్షితంగా బ‌య‌ట‌ప‌డ్డారు. మ‌రోవైపు ఘ‌ట‌నా స్థ‌లంలో గ్రామ‌స్థులు నిర‌స‌న‌కు దిగారు. ప్ర‌మాద‌కరంగా ఉన్న మ‌లుపు వ‌ద్ద ప్ర‌మాద సూచిక‌లు ఏర్పాటు చేయాల‌ని వారు డిమండ్ చేశారు.

Leave A Reply

Your email address will not be published.