రేపటి నుండి గ్రూప్-2 పరీక్షల హాల్ టికెట్ల డౌన్‌లోడ్
హైదరాబాద్ (CLiC2NEWS): రాష్ట్రంలో రేపటి నుండి గ్రూప్-2 పరీక్షల హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చిని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తెలిపింది. మొత్తం 783 గ్రూప్-2 పోస్టులకు 5.51 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. పరీక్షలు ఈ నెల 15,16 తేదీల్లో గ్రూప్-2పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం, మధ్యాహ్నం 2 సెషన్లలో పరీక్షలు జరుగుతాయి.