ద్విచ‌క్ర వాహ‌నాన్ని ఢీకొట్టిన టిప్ప‌ర్ లారీ.. ముగ్గురు మృతి

బాప‌ట్ల‌ (CLiC2NEWS): చిల‌క‌లూరి పేట ర‌హ‌దారిపై ఘోర రోడ్డు ప్ర‌మాదం చేసుకుంది. ద్విచ‌క్ర వాహ‌నంపై వెళుతున్న ముగ్గురు వ్య‌క్తులు రోడ్డు ప్ర‌మాదానికి గురై ప్రాణాలు కోల్పోయారు. వారి వాహ‌నాన్ని టిప్ప‌ర్ లారీ ఢీకొట్టి ప్ర‌మాదం జ‌రిగింది. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన‌వారుగా గుర్తించారు. ఈ ఘ‌ట‌న బాప‌ట్ల జిల్లా అన్నంబోట్ల‌వారిపాలెం స‌మీపంలో ప‌ర్చూరు- చిల‌క‌లూరిపేట ర‌హ‌దారిపై చోటుచేసుకుంది. మృతి చెందిన వారు చీరాల మండ‌లం వాడ‌రేవుకు స‌ముద్ర‌స్నానానికి వెళ్లి .. తిరిగి వెళుతున్న క్ర‌మంలో వారి వాహ‌నం ప్ర‌మాదానికి గురైంది. ఈ ప్ర‌మాదంలో షేక్ మ‌స్తాన్ వ‌లి, అమీరున్ దంప‌తులు అక్క‌డిక‌క్క‌డే మృతి చెందారు. అత్త షేక్ చిన బుడెమ్మ ఆస్ప‌త్రికి త‌ర‌లిస్తుండ‌గా చికిత్స పొందుతూ మృతి చెందింది.

Leave A Reply

Your email address will not be published.