ఎపి డిప్యూటి సిఎం పవన్‌కల్యాణ్ పేషీకి బెదిరింపు కాల్స్ ..
అమరావతి (CLiC2NEWS): చంపేస్తామంటూ హెచ్చరిస్తూ ఎపి ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ పేషీకి బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఈ విషయాన్ని అధికారులు, పవన్ కాల్యాణ్ పోలీసులు దృష్టికి తీసుకెళ్లారు. డిసిఎం పేషీకి రెండు సార్లు బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చాయని డిజిపి.. హోంమంత్రి అనిత కు వివరించారు. దీనిపై స్పందించిన హోంశాఖ మంత్రి అనిత .. ఫోన్ కాల్స్ ట్రేస్ చేసి నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజాప్రతినిధుల పట్ల ఈ విధమైన చర్యలకు పాల్పడేవారిని ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపేక్షించరాదని స్పష్టం చేశారు.