భిక్షాటన చేసేవారికి డబ్బులిస్తే ఎఫ్ఐఆర్ నమోదు

ఇండోర్ (CLiC2NEWS): యాచకులకు డబ్బులిస్తే వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని మధ్యప్రదేశ్ లోని ఇండోర్ జిల్లా అధికారులు హెచ్చరించారు. నగరాన్ని యాచకులు లేని ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు అధికారులు అనేక చర్యలు చేపట్టారు. బిక్షాటన చేసే వారికి డబ్బులిస్తే ఎఫ్ ఐఆర్ లు నమోదు చేస్తామని ప్రకటించారు.జనవరి 1 నుండి యాచకులకు ఎవరైనా డబ్బులు ఇస్తున్నట్లు కనిపిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వారికి ఎటువంటి సాయం చేయెద్దని. వారిని పునరావాస కేంద్రాలను తరలించాలని విజ్ఞప్తి చేశారు. దేశంలోని 10 నగరాల్లో పైలట్ ప్రాజెక్టు కింద కేంద్ర సామాజిక న్యాయ, సాధికారక మంత్రిత్వ శాఖ ప్రారంభించింది. ఢిల్లీ, బెంగళూరు, చెన్నై , హైదరాబాద్ సహా పలు నగరాల్లో ఈ జాబితాలో ఉన్నాయి.