ఢిల్లీలోని లాజిస్టిక్ మేనేజ్‌మెంట్ కంపెనీలో సెక్రటరీ పోస్టులు

NHLML: నేషనల్ హైవే లాజిస్టిక్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్ (ఎన్‌హెచ్ఎల్ఎంఎల్) లో 7 కంపెనీ సెక్రటరీ పోస్టులను ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు. ఆసక్తి గల అభ్యర్థుల నుండి దరఖాస్తులను కోరుతుంది. డిగ్రీ, సిఎ, సిఎంఎతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల వయస్సు 40 ఏళ్ల లోపు ఉండాలి. ఎంపికైన అభ్యర్థులకు నెలకు వేతనం రూ.84,000 అందుతుంది. ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తులు పంపించడానికి చివరి తేదీ డిసెంబర్ 31గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు https://nhlml.org/ వెబ్‌సైట్ చూడగలరు.