రాజేంద్ర‌న‌గర్‌లోని ఐఐఎంఆర్‌లో యంగ్ ప్రొఫెష‌న‌ల్స్ పోస్టులు

IIMR: న‌గ‌రంలోని రాజేంద్ర‌న‌గర్ ఐసిఎఆర్‌కు చెందిన ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రిసెర్చ్, ప్రొఫెష‌న‌ల్స్ ఖాళీల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. ఒప్పంద ప్రాతిప‌దిక‌న ఆరుగురు యంగ్ ప్రొఫెష‌న‌ల్స్ పోస్టులకు ఆన్‌లైన్ ఇంట‌ర్వ్యూలు నిర్వ‌హిస్తోంది. జ‌న‌వరి 3న ఇంట‌ర్వ్యూ నిర్వ‌హిస్తారు. యంగ్ ప్రొఫెష‌న‌ల్స్ -1 పోస్టులు 3 ఉన్నాయి. ఈ పోస్టుల‌కు ఎంపికైన వారికి నెల‌కు వేత‌నం రూ.42,000 అందుతుంది. యంగ్ ప్రొఫెష‌న‌ల్స్ -11 పోస్టులు 3 .. ఈ పోస్టుల‌కు ఎంపికైన వారికి నెల‌కు వేత‌నం రూ. 30,000 అందుతుంది.

ఎంపిక:ద‌ర‌ఖాస్తుల‌ను షార్ట్‌లిస్ట్ చేసి, ఆన్‌లైన్ ఇంట‌ర్వ్యూ ద్వారా ఎంపిక జ‌రుగుతుంది. ద‌ర‌ఖాస్తుల‌ను ఈ నెల 30లోపు మెయిల్ ద్వారా పంపించాల్సి ఉంది.

అర్హ‌త :బిఎస్ సి అగ్రిక‌ల్చ‌ర్‌, పిజి, అగ్రి బిజినెస్ మేనేజ్‌మెంట్ పిజి/ పిజిడిఆర్‌డి , పిజిడిఎబిఎంతో పాటు ఉద్యోగానుభ‌వం ఉండాలి. అభ్య‌ర్థుల వ‌య‌స్సు ఇంట‌ర్వ్యూ తేదీ నాటికి 45 ఏళ్లు మించ‌కూడ‌దు. ఎస్‌టి, ఎస్‌సి , మ‌హిళ‌ల‌కు ఐదేళ్ల స‌డ‌లింపు ఉంటుంది. పూర్తి వివ‌రాల‌కు https://www.millets.res.in/ వెబ్‌సైట్ చూడ‌గ‌ల‌రు.

Leave A Reply

Your email address will not be published.