ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్ 21న మొట్టమొదటి సారి ‘ధ్యాన దినోత్సవం’
ప్రపంచ వ్యాప్తంగా మొట్టమెదటి సారి డిసెంబర్ 21 వ తేదీన ‘ప్రపంచ ధ్యాన దినోత్సవం’ జరగనుంది. ఆ రోజున ప్రఖ్యాత ఆధ్యాత్మికవేత్త గురువేవ్ శ్రీశ్రీ రవిశంకర్ ఐరాసలో ప్రసంగించనున్నారు. డిసెంబర్ 21వ తేదీన ప్రపంచ ధ్యాన దినోత్సవంగా ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ ప్రకటించింది. ప్రపంచ శాంతి, సామరస్యాలను నెలకొల్పేందుకు ధ్యానం ఎంత అవసరమో ప్రపంచం గుర్తించిందన్నారు. న్యూయార్క్‌లోని ఐరాసలో ఉన్న భారత శాశ్వత మిషన్ ప్రథమ ధ్యాన దినోత్సవాన్ని జరపనున్నారు. ఈ కార్యక్రమంలో గురుదేవ్ కీలకోపన్యాసం ఉంటుంది. అనంతరం ప్రపంచ శాంతి, సామరస్యం కోసం ధ్యానం చేయించనున్నారు. ఈ కార్యక్రమంల ప్రపంచమంతా ప్రత్యక్ష ప్రసారం కానుంది. ఐరాస ద్వారా ధ్యానానికి గుర్తింపు రావడం ఓ ప్రధాన ఘట్టమని గురుదేవ్ అన్నారు.