TS: మార్చి 21 నుండి ఏప్రిల్ 4 వరకు పదో తరగతి పరీక్షలు
హైదరాబాద్ (CLiC2NEWS): రాష్ట్రంలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. వచ్చే ఏడాది మార్చి 21 నుండి ఏప్రిల్ 2 వరకు పరీక్షలు జరగనున్నాయి. ఏప్రిల్ 3 ఒకేషనల్ కోర్సు మొదటి పేపర్ భాషా పరీక్ష, 4 న ఒకేషనల్ కోర్సు రెండో పేపర్ భాషా పరీక్ష జరుగుతాయి. ఈ మేరకు ఎస్ఎస్‌సి బోర్డు ప్రకటించింది.
మార్చి 21 ఫస్ట్ లాంగ్వేజ్
మార్చి 22 సెకండ్ లాంగ్వేజ్
మార్చి 24 ఇంగ్లీష్
మార్చి 26 గణితం
మార్చి 28 ఫిజిక్స్,
మార్చి 29 బయాలజి,
ఏప్రిల్ 2 సోషల్ స్టడీస్