అల్లు అర్జున్‌కు రెగ్యులర్ బెయిల్ మంజూరు: నాంపల్లి కోర్టు
హైదరాబాద్ (CLiC2NEWS): సినీ నటుడు అల్లుఅర్జున్‌కు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. సంధ్య థియేటర్ ఘటన కేసులో అల్లు అర్జున్ పిటిషన్ దాఖలు చేయగా.. ఇటీవల వాదనలు ముగిశాయి. ఈ క్రమంలో శుక్రవారం నాంపల్లి కోర్టు తీర్పు వెలువరించింది. రూ.50వేల రెండు పూచీకత్తులను సమర్పించాలని, పోలీసుల విచారణకు సహకరించాలని, ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌లో మాజరు కావాలని , సాక్షులను ప్రభావితం చేయెద్దని.. షరతులతో కూడిన రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసినట్లు సమాచారం.
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన కేసులో నాంపల్లి కోర్టులో రిమాండ్ విధించింది. దీంతో అల్లుఅర్జున్‌ను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అనంతరం హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయగా ఆయన విడుదలయ్యారు. నాంపల్లి కోర్టు విధించిన రిమాండ్ ముగియడంతో బన్ని వర్చువల్‌గా విచారణకు హజరయ్యారు. ఆయన తరపు న్యాయవాదులు రెగ్యులర్ బెయిల్‌కు పిటిషన్ దాఖలు చేయగా.. విచారణ జరిపిన న్యాయస్థానం ఇవాళ బెయిల్ మంజూరు చేసింది.