సిబిఎస్ఇలో 212 పోస్టులు

CBSE: సెంట్ర‌ల్ బోర్డ్ ఆఫ్ సెకండ‌రీ ఎడ్యుకేష‌న్ (సిబిఎస్ఇ) లో సూప‌రింటెండెంట్ , జూనియ‌ర్ అసిస్టెంట్ పోస్టులు భ‌ర్తీ చేయ‌నున్నారు. ఈ పోస్టుల‌ను డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిప‌దిక‌న భ‌ర్తీ చేయుట‌కు ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తుంది. మొత్తం పోస్టులు 212. సూప‌రింటెండెంట్ పోస్టులు 142.. జూనియ‌ర్ అసిస్టెంట్ పోస్టులు 70 ఉన్నాయి. ఆస‌క్తి గ‌ల అభ్య‌ర్థులు ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు. ద‌ర‌ఖాస్తు రుసుం రూ. 800గా నిర్ణ‌యించారు. ఎస్‌సి , ఎస్ టి , దివ్యాంగులు, ఎక్స్ స‌ర్వీస్‌మెన్‌, మ‌హిళ‌త‌కు ఫీజు మిన‌హాయించారు. ద‌ర‌ఖాస్తు చేసుకునేందుకు చివ‌రి తేదీ జ‌న‌వ‌రి 31. ప్రిలిమిన‌రీ, మెయిన్స్ (సిబిటి), స్కిల్ టెస్ట్, షార్ట్ లిస్టింగ్ ఆధారంగా అభ్య‌ర్థుల‌ను ఎంపిక జ‌రుగుతుంది

సూపరింటెండెంట్ పోస్టుల‌కు డిగ్రీ ఉత్తీర్ణ‌త‌తో పాటు కంప్యూట‌ర్ ప‌రిజ్ఞానం ఉండాలి. వ‌య‌స్సు 30 ఏళ్ల‌కు మించ‌కూడ‌దు.

జూనియ‌ర్ అసిస్టెంట్ పోస్టుల‌కు ఇంట‌ర్మీడియ‌ట్ లేదా త‌త్స‌మాన విద్యార్హ‌త‌, ఇంగ్లిష్‌, హిందీ కంప్యూట‌ర్ టైపింగ్ స్కిల్స్ ఉండాలి. వ‌య‌స్సు 18 నుండి 27 ఏళ్లు ఉండాలి.

ఎస్‌సి, ఎస్‌టిల‌కు ఐదేళ్లు.. ఒబిసిల‌కు మూడేళ్లు.. దివ్యాంగుల‌కు ప‌దేళ్ల
స‌డ‌లింపు ఉంటుంది. పూర్తి వివ‌రాల‌కు https://www.cbse.gov.in/ వెబ్‌సైట్ చూడ‌గ‌ల‌రు.

Leave A Reply

Your email address will not be published.