తిరుపతిలో జూనియర్ రిసెర్చ్ పోస్టులు
తిరుపతిలోని నేషనల్ అట్మాస్మియరిక్ ల్యాబొరెటరీలో 19 జూనియర్ రిసెర్చ్ పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. దరఖాస్తులకు చివరి తేదీ జనవరి 24. ఈ తేదీ నాటికి అభ్యర్థుల వయస్సు 28 ఏళ్లు ఉండాలి. ఎస్‌సి/ ఎస్‌టి, ఒబిసి, పిడబ్ల్యుబిడి/ ఎక్స్ సర్వీస్‌మెన్‌లకు సడలింపు ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 37వేలు వేతనం అందుతుంది. ఫిజిక్స్/ అట్మాస్ఫియరిక్ సైన్స్/ స్సేస్ ఫిజిక్స్/ మెటలర్జి తదితర విభాగంలో పిజితో పాటు సిఎస్ ఐఆర్- యుజిసి నెట్ / గేట్/ జామ్ / జెఇఎస్‌టి స్కోరు అర్హత కలిగి ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు. పూర్తి వివరాలకు www.narl.gov.in/ వెబ్‌సైట్ చూడగలరు.