Delhi: రూ.25 లక్షల ఆరోగ్య బీమా .. కాంగ్రెస్ హామీ
ఢిల్లీ (CLiC2NEWS): దేశ రాజధాని ఢిల్లీలో ఎన్నికల నగారా మోగిన విషయం తెలిసిందే. మంగళవారం ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఢిల్లీలోని 70 అసెంబ్లీ స్థానాలకు వచ్చేనెల 5న ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి 8న ఫలితాలు వెలువడతాయి. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీలు ప్రచారాల పర్వానికి తెరలేపి.. హామీల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా జీవన్ రక్ష యోజన అనే పథకాన్ని కాంగ్రెస్ ప్రవేశపెట్టింది. దీని ద్వారా ఒక్కో కుటుంబానికి రూ.25లక్షల ఆరోగ్య బీమా కల్పించనున్నట్లు కాంగ్రెస్ హామీ ఇచ్చింది.
రాజస్థాన్ మాజి సిఎం అశోక్ గహ్లోత్ జీవన్ రక్ష యోజన పథకాన్ని బుధవారం ప్రవేశపెట్టారు. రాజస్థాన్లో తాము అధికారంలో ఉన్నపుడు ఇదే పథకాన్ని అమలు చేసినట్లు తెలిపారు. ఇప్పటికే ప్యారి దిది యోజన పథకం కింద ప్రతి మహిళకు ప్రతి నెల రూ.2,500 ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఇపుడు తాజాగా జీవన్ రక్షయోజన తీసుకొచ్చింది.