వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం టికెట్ల క్యూలైన్‌లో తొక్కిస‌లాట‌.. ఆరుగురు మృతి

తిరుప‌తి (CLiC2NEWS): తిరుప‌తిలో ఏర్పాటు చేసిన తొమ్మిది కేంద్రాల్లో ఏర్పాటు చేసిన 94 కౌంట‌ర్ల ద్వారా వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం టికెట్లు జారీ చేయాల‌ని టిటిడి నిర్ణ‌యించిన  సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో శ్రీ‌నివాసం వ‌ద్ద వైకుంఠ ద్వార స‌ర్వ‌ద‌ర్శ‌నం టికెట్లు జారీ చేస్తున్నారు. టొకెన్ల కోసం ఒక్క‌సారిగా భ‌క్తులు కిక్కిరిసి పోవ‌డంతో తీవ్ర తోపులాట‌ జ‌రిగి .. న‌లుగురు ప్రాణాలు కోల్పోయారు. మ‌రికొంత మంది అస్వ‌స్థ‌త‌కు గురైన‌ట్లు స‌మాచారం. మ‌ర‌ణించిన రిలో త‌మిళ‌నాడులోని సేలంకు చెందిన మ‌హిళ‌ ఉన్నారు.

జ‌న‌వరి 10, 11, 12 తేదీల్లో వైకుంఠ ద్వార ద‌ర్శ‌నాల‌కు సంబంధించిన మొత్తం 1.20ల‌క్ష‌ల టోకెన్లు గురువారం ఉద‌యం విడుద‌ల చేయ‌నున్నారు. ఈ నేప‌థ్యంలో టోకెన్ల కోసం భ‌క్తులు ఇవాళ‌ సాయంత్ర‌మే భ‌క్తులు భారీగా త‌ర‌లివ‌చ్చారు. క్యూలైన్లోకి భ‌క్తుల‌ను ఒక్క‌సారిగా వ‌ద‌ల‌డంతో తోపులాట జ‌రిగింది. టిటిడి ఇఒ శ్యామ‌ల‌రావు ఘ‌ట‌నాస్థ‌లాన్ని ప‌రిశీలించారు. తిరుప‌తిలోని శ్రీ‌నివాసం,విష్ణు నివాసం,స‌త్య‌నారాయ‌ణ పురం బైరాగి ప‌ట్టెడ రామానాయుడు స్కూల్ వ‌ద్ద ఏర్పాటు చేసిన కేంద్రాల్లో తోపులాట జ‌రిగింది.

Leave A Reply

Your email address will not be published.