HRRL: రాజస్థాన్ రిఫైనరి లిమిటెడ్లో 121 ఎగ్జిక్యూటివ్ పోస్టులు
రాజస్థాన్లోని హెచ్ పిసిఎల్ రాజస్థాన్ రిఫైనరి లిమిటెడ్.. (జాయింట్ వెంచర్ కంపెని)లో ఖాళీలు భర్తీ చేసేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
కెమికల్, ఇన్స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రికల్, ఇన్ఫర్మేషన్ సిస్టమ్, టెక్నికల్ ప్లానింగ్ , ప్రొసెస్ (రిఫైనరి/ ఆపోజిట్ అండ్ ప్లానింగ్) క్వాలిటి కంట్రోల్, మెకానికల్, ఫైర్ అండ్ సేఫ్టీ విభాగాల్లో ఈ క్రింది పోస్టులు కలవు.
మొత్తం పోస్టులు 121
జూనియర్ ఎగ్జిక్యూటివ్- 80
ఇంజినీర్ -8
సీనియర్ ఇంజినీర్ – 11
ఆఫీసర్ – 1
సీనియర్ మేనేజర్ – 23
జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు నెలకు వేతనం రూ. 30వేల నుండి రూ.1.20,000 వరకు అందుతుంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 25 ఏళ్లకు మించకూడదు.
ఇంజినీర్, ఆఫీసర్ లకు నెలకు వేతనం రూ. 50 వేల నుండి రూ.1.60,000 వరకు అందుతుంది. ఈ పోస్టులకు వయస్సు 29 ఏళ్లకు మించకూడదు.
సీనియర్ ఇంజినీర్ పోస్టులకు రూ. 60 వేల నుండి రూ. 1.80 .. ఈ ఉద్యోగాలకు అభ్యర్థుల వయస్సు 34 ఏళ్లు.
సీనియర్ మేనేజర్లకు ప్రారంభ వేతనం నెలకు రూ. 80 వేలు నుండి రూ. 2,20,000. వరకు అందుతుంది. ఈ పోస్టులకు 42 ఏళ్ల వయస్సు ఉండాలి.
పోస్టును అనుసరించి సంబంధిత విభాగాల్లో డిప్లొమా, బిఎస్సి, బిఇ/ బిటెక్, ఎంబిఎతో పాటు ఉద్యోగానుభవం తప్పనిసరి. దరఖాస్తు రుసుం యుఆర్/ ఒబిసి/ ఇడబ్ల్యు ఎస్ అభ్యర్థులకు రూ.1180. ఎస్సి , ఎస్టి , దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు మినహాయించారు. దరఖాస్తులను వచ్చేనెల 8వ తేదీ లోపు పంపించాల్సి ఉంది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. పూర్తి వివరాలకు అభ్యర్థులు https://hrrl.in/Hrrl/ వెబ్సైట్ చూడగలరు.