ఎపిలోని యురేనియం కార్పొరేషన్లో 32 అప్రెంటిస్ పోస్టులు
పదో తరగతి, ఐటిఐ ఉత్తీర్ణతతో ఎపిలోని యురేనియం కార్పొరేషన్లో అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎపిలోని యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, వైఎస్ ఆర్ కడప.. వివిధ విభాగాల్లో అప్రెంటిస్ ఖాళీలు భర్తీ చేయనున్నారు.
ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, వెల్డర్, టర్నర్ / మెషనిస్ట్, డీజిల్ మెకానిక్ , కార్పెంటర్, ప్లంబర్ విభాగాల్లో మొత్తం 32 పోస్టులు ఉన్నాయి. వచ్చేనెల 12వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. విద్యార్హతల్లో సాధించిన మెరిట్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది. అభ్యర్థుల వయస్సు 13.01.2025 నాటికి 18 నుండి 25 ఏళ్ల మధ్య ఉండాలి.
అప్రెంటిస్ ఖాళీలు
ఫిట్టర్ – 9
ఎలక్ట్రీషియన్ – 9
వెల్డర్ – 4
టర్నర్ / మెషనిస్ట్ – 3
డీజిల్ మెకానిక్ – 3
కార్పెంటర్ – 2
ప్లంబర్ 2 కలవు
అభ్యర్థులు పూర్తి వివరాల కోసం https://ucil.gov.in/job.html వెబ్సైట్ చూడగలరు