రేషన్ దుకాణాల్లో ఇక నుండి సన్నబియ్యం.. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
నారాయణపూర్ (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్రంలోని రేషన్ కార్డుల లబ్ధిదారులకు శుభవార్త. రేషన్ దుకాణాల్లో ఇక నుండి లబ్ధి దారులకు సన్న బియ్యం పంపిణీ చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. కరీంగనగర్ జిల్లా నారాయణపూర్లో నిర్వహించిన గ్రామసభలో మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో 40 లక్షల మందికి లబ్ధి చేకూర్చేలా కొత్త రేషన్ కార్డులు తీసుకొస్తున్నామన్నారు. గత ప్రభుత్వం రేషన్ కార్డులపై దృష్టి పెట్టలేదని ఆయన విమర్శించారు. వ్యవసాయయోగ్యమైన భూములకు ఏటా ఎకరాకు రూ.12వేలు ఇస్తామన్నారు. అంతేకాకుండా, భూమిలేని వ్యవసాయ కూలీలకు డబ్బులు ఇస్తామన్నారు. నారాయణపూర్ ప్రాజెక్టు పూర్తి చేస్తామని మంత్రి ఈ సందర్బంగా హామీ ఇచ్చారు. ముంపు గ్రామాల ప్రజలకు సరైన న్యాయం చేస్తామని .. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందిస్తామని మంత్రి తెలిపారు.