76వ గ‌ణ‌తంత్ర దినోత్స‌వానికి ముఖ్య అతిథిగా ఇండోనేషియా అధ్య‌క్షుడు

ఢిల్లీ (CLiC2NEWS): 2025 గ‌ణ‌తంత్ర దినోత్స‌వ‌పు వేడుక‌ల‌కు ముఖ్య అతిథిగా ఇండోనేషియా అధ్య‌క్షుడు ప్ర‌బోవో సుబియాంటో హాజ‌రుకానున్న‌ట్టు స‌మాచారం. ఈ ఏడాది గ‌ణ‌తంత్ర దినోత్స‌వ ప‌రేడ్‌లో ఇండోనేషియ పాల్గొన‌నున్న‌ట్లు అధికారిక వ‌ర్గాలు వెల్ల‌డించాయి. 1950 వ సంవ‌త్స‌రం నుండి మ‌న దేశం మిత్ర దేశాల నేత‌ల‌కు గ‌ణ‌తంత్ర దినోత్స‌వ వేడుకల‌కు ఆహ్వానించ‌డం సాంప్ర‌దాయంగా వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ నెల జ‌న‌వ‌రి 26న క‌ర్త‌వ్య‌ప‌థ్‌లో 76వ గ‌ణ‌తంత్ర ద‌నోత్స‌వ ప‌రేడ్‌ను నిర్వ‌హించ‌నున్నారు. ఈ ప‌రేడ్లో ఇండోనేషియాకు చెందిన 160 మంది స‌భ్యుల క‌వాతు బృందం, 190 మంది స‌భ్యుల బ్యాండ్ బృందం భార‌త సైనికుల‌తో క‌లిసి క‌వాతు నిర్వ‌హించ‌నున్నారు. ఈ మేర‌కు భారత ర‌క్ష‌ణ మంత్రిత్వ శాఖ వెల్ల‌డించింది. ప‌రేడ్‌లో సాయుధ ద‌ళాలు, పారామిలిట‌రీ బ‌ల‌గాలు, స‌హాయక పౌర బ‌ల‌గాలు,, ఎన్‌సిసి , ఎన్ ఎస్ ఎస్ బృందాలు పాల్గొంటాయి. గ‌తేడాది గ‌ణ‌తంత్ర దినోత్స‌వ‌పు వేడుక‌ల‌కు ఫ్రాన్స్ అధ్య‌క్షుడు ఇమ్మానియేల్ మెక్రాన్ ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు.

Leave A Reply

Your email address will not be published.