INCOIS: 39 రిసెర్చ్ ఫెలో పోస్టులు
INCOIS: జూనియర్ రీసెర్చ్ ఫెలో, రీసెర్చ్ అసోసియేట్ పోస్టులను భర్తీ చేసేందుకు ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ (ఐఎన్‌సిఒఐఎస్)దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం 39 పోస్టులు కలవు. ఎంపికైన అభ్యర్థలకు నెలకు వేతనం రూ.67,000 అందుతుంది. దరఖాస్తులను ఫిబ్రవరి 10వ తేదీలోపు పంపించాల్సి ఉంది. అభ్యర్థులను రాత పరీక్ష, ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపిక చేస్తారు. అభ్యర్థుల వయస్సు 35 ఏళ్లు మించకూడదు.
అర్హత: సంబంధిత విభాగంలో పిహెచ్‌డి( సిస్మాలజి/ ఫిజిక్స్ / జాగ్రఫి/ ఎర్త్ సైన్సెస్/ మెరైన్ సైన్స్ / మెరైన్ బయాలజి/ అట్మాస్మియర్ సైన్స్/ క్లైమేట్ సైన్స్ / మెటీరియాలజి/ ఓషనోగ్రఫి/ ఫిజిక్స్ / మ్యాథ్స్ు సోషల్ వర్క్ / సోషియాలజి/ జెండర్ స్టడీస్/ పబ్లిక్ హెల్త్/ డిజాస్టర్ మ్యానేజ్‌మెంట్ తో పాటు పని అనుభవం ఉండాలి. దరఖాస్తులు, పరీక్ష తేదీలు, సిలబస్ తదితర పూర్తి వివరలకు అభ్యర్థులు https://vacancies.incois.gov.in/ వెబ్‌సైట్ చూడగలరు.