మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం.. 12 మంది మృతి

జల్‌గావ్ (CLiC2NEWS): మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. జల్‌గావ్ జిల్లాలో బుధవారం సాయంత్రం రైలు ప్రమాదం చోటుచేసుకుంది. పుష్పక్ ఎక్స్‌ప్రెస్ (లఖ్‌నవూ-ముంబయి) రైలులో ప్రయాణించే వారు చైన్ లాగి పట్టాలు దాటుతుండగా.. మరో రైలు దూసుకొచ్చింది. ఈ ప్రమాదంలో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. దాదపు 40 మంది గాయపడ్డారు. మృతులు సంఖ్య పెరిగే అవకాశమున్నట్లు సమాచారం. పుష్కక్ ఎక్స్‌ప్రెస్ రైలులో మంటుల వ్యాపించినట్లు వదంతులు రావడంతో ప్రయాణికులు చైన్‌లాగి కిందికి దిగినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో పట్టాలు దాటుతుండగా కర్ణాటక ఎక్స్‌ప్రెస్ (బెంగళూరు-ఢిల్లీ రైలు వచ్చి ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు.
రైలు ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున పరిహారం చెల్లిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. గాయపడిన వారికి చికిత్స నిమిత్తం ఖర్చులు భరించనున్నట్లు తెలిపింది.