ఖమ్మం జిల్లాలో విషాదం.. ఇద్దరు కూతుళ్లను చంపి తల్లి ఆత్మహత్య
మధిర (CLiC2NEWS): ఖమ్మం జిల్లా మధిరలో విషాదం చోటుచేసుకుంది. ఓ తల్లి తన ఇద్దరు కుమార్తెలను చంపి.. తాను బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన ఖమ్మం జిల్లాలోని మధిర మండలం నిదానపురంలో చోటుచేసుకుంది. చోరీ కేసులో భర్త (షేక్ బాజీని ) పోలీసులు తీసుకెళ్లడంతో అవమానంతో భార్య ఈ దారుణానికి ఒడిగట్టినట్టు తెలుస్తోంది. భర్తను పోలీసులు స్టేషన్‌కు తీసుకెళ్లారనే అవమానభారంతో ఇద్దరు కుమార్తెలను చంపేసి తర్వాత ఆమె ఉరేసుకుంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరకుని పరిశీలించారు.