బిల్‌గేట్స్‌తో సిఎం చంద్రబాబు భేటీ
1995 లో ఐటి.. ఇప్పుడు 2025లో ఎఐ..
అమరావతి (CLiC2NEWS): ప్రపంచ ఆర్ధిక సదస్సు లో మైక్రోసాప్ట్ వ్యవస్థాపకుడు,బిల్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ (బిఎంజిఎఫ్) వ్యవస్తాపకుడు బిల్‌గేట్స్‌తో ఎపి ముఖ్యమంత్రి భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేయనున్న కృత్రిమ మేధ (ఎఐ) యూనివర్సిటి కోసం నియమించిన సలహామండలిలో భాగస్వాములు కావాలని ఆయన బిల్‌గేట్స్‌ను కోరారు. ఎపిలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ హెల్త్ ఇన్నోవేషన్ అండ్ డయాగ్నస్టిక్స్‌ను ఏర్పాటు చేయాలని, బిల్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ అమలు చేస్తున్న హెల్త్ డ్యాష్‌బోర్డుఉల, సామాజిక కార్యక్రమాలను ఎపిలోనూ నిర్వహించాలని చంద్రబాబు కోరారు. ఆరోగ్యం , విద్యా రంగాల్లో ఆవిష్కరణలకు రాష్ట్రాన్ని గ్లోబల్ హబ్‌గా మర్చేందుకు సహకారం అందించాలని బిల్‌గేట్స్‌ను కోరినట్లు చంద్రబాబు తెలిపారు.
చాలాకాలం తర్వాత బిల్‌గేట్స్‌ను కలుసుకోవడం సంతోషాన్ని కలిగించిందని సిఎం చంద్రబాబు ఎక్స్‌లో పోస్టు పెట్టారు. అప్పట్లో 1995 లో ఐటి.. ఇప్పుడు 2025లో ఎఐ అంటూ.. 1995లో బిల్‌గేట్స్ గత సమావేశాన్ని, ప్రస్తుతం 2025 సమావేశాన్ని పోలుస్తూ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. 1995లో చంద్రబాబు తొలిసారి సిఎంగా బాధ్యతలు చేపట్టినపుడు రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా హైదరాబాద్‌లో మైక్రోసాప్ట్ కేంద్రం ఏర్పాటుకు బిల్‌గేట్స్‌ను కలిశారు. ప్రస్తుతం మళ్లీ సిఎంగా ఉన్నపుడు మరోసారి బిల్‌గేట్స్‌ను కలిశారు. ఇపుడు ఎపిలో ఎఐ రంగంలో ఎపిని నాయకత్వ స్థానంలో నిలబెట్టేలా ఎఐ అభివృద్ధి, సహకారం అందించాలని బిల్‌గేట్స్‌ను కోరినట్లు తెలిపారు.